చికిత్స పొందుతూ తౌషిక్ తల్లి మౌలాబి మృతి

Sep 12, 2026 - 09:17
Sep 12, 2026 - 09:22
 0  25
చికిత్స పొందుతూ తౌషిక్  తల్లి మౌలాబి మృతి

ఆరు నెలలుగా న్యాయం కోసం పోరాటం.                                    - చివరకు ఆ పోరాటమే ఆ తల్లి ప్రాణాలను తీసింది!

సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్‌లో మృతి చెందిన తన కుమారుడు తౌషిక్  ది ఆత్మహత్య కాదని హత్చేనని   విచారణ చేపట్టి న్యాయం చేయాలంటూ...ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ... న్యాయ పోరాటం సాగిస్తున్న మౌలాబి ఇక లేరు. రెండు రోజుల క్రితం...నాకు న్యాయం జరగలేదు.. అంటూ తీవ్ర ఆవేదనకు గురై పురుగుల మందు తాగిన మౌలాబి ని ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మౌలాబి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.కొడుకును కోల్పోయిన తల్లి...కొడుకుకు న్యాయం చేయాలని పోరాడింది...ఆ పోరాటంలో చివరకు తన ప్రాణాలనే కోల్పోయింది...ఒక తల్లి కన్నీటికి విలువ లేదా..?ఆ కుటుంబం ఆవేదనకు సమాధానం ఎవరు?కొడుకుకు న్యాయం కోసం పోరాడిన ఆ తల్లికి...ఇక న్యాయం ఎవరు చేస్తారు?న్యాయం కోసం సాగిన ఆరు నెలల పోరాటం...ఒక విషాదాంతంగా ముగిసింది. మౌలాబి ఫైల్ ఫోటో 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow