కుప్పంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం - చంద్రబాబు నాయుడు

కుప్పంలో భారీ మెజారిటీతో గెలవ బోతున్నాం..కార్యకర్తలతో చంద్రబాబు.
జనసాక్షి : గత ఏడు ఎన్నికల లోనూ రానంత భారీ మెజారిటీతో కుప్పంలో గెలవబోతున్నాం, అలాగే గత 35 ఏళ్లలో కుప్పాన్ని ఎంత అభివృద్ధి చేశామో అంతకన్నా ఎక్కువ వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తాం అని చంద్రబాబు గారు అన్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు కుప్పం నుండి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో మంగళగిరి ఎన్టీఆర్ భవనంలో చంద్రబాబు మాట్లాడుతూ, కుప్పం ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలో కార్యకర్తలకు అండగా ఉండడం కోసమే ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్సీ డా.కంచర్ల శ్రీకాంత్ కు కుప్పం బాధ్యతలు అప్పగించానని, ఎన్నికలు పూర్తయ్యాక ఐదేళ్లు కూడా శ్రీకాంత్ కుప్పం లోనే ఉంటారని, చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే ఏ పార్టీకి లేనంత బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీ సొంతమని, నాయకులు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డా.కంచర్ల శ్రీకాంత్, పి.ఎస్.మునిరత్నం, ఆర్.చంద్రశేఖర్, డా.సురేష్ బాబు, గౌనివారి శ్రీనివాసులు, గాజుల గోపి, ఖాదర్ బాషా, ప్రేమ్ కుమార్, రాజ్ కుమార్, టి.ఎం బాబు నాయుడు, విశ్వనాథ నాయుడు తదితరులు హాజరయ్యారు.
What's Your Reaction?






