ఏపీలో అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకం కింద ఏ వైనా కట్టడాలు ఎంపికయ్యాయ

ఆంధ్రప్రదేశ్‌లో అడాఫ్ట్ ఎ హెరిటేజ్ పథకం కింద ఏవైనా కట్టడాలు ఎంపికయ్యాయా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడాఫ్ట్ ఎ హెరిటేజ్((AAH) 2.0 పథకం కింద ఎంపికైన స్మారక చిహ్నాలు/స్థలాల వివరాలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరారు. సోమవారం లోక్‌సభలో ఈ మేరకు అడాప్షన్ ఆఫ్ హెరిటేజ్ పథకంపై ఆయన పలు ప్రశ్నలు వేశారు. అడాప్షన్ ఆఫ్ హెరిటేజ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్మారక చిహ్నాలు/స్థలాల వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రాల వారీగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వారసత్వ పథకం కింద 'ఆసక్తి వ్యక్తీకరణ' పొందిన వాటి వివరాలు కోరారు. అలాగే రాష్ట్రంలో ఆదర్శ స్మారక్ పథకం కింద ఉన్న స్మారక చిహ్నాల జాబితాను పొడిగించే ఆలోచన ఉందా అని ఆరా తీశారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అడాఫ్ట్ ఎ హెరిటేజ్ (AAH) 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏ రక్షిత స్మారక చిహ్నాన్ని ఎంపికచేయలేదని సమాధానమిచ్చారు. AAH 2.0 కార్యక్రమం ద్వారా పర్యాటకుల అనుభవాన్ని మెరుగుపరిచి సరైన వసతులు కల్పించేలా అభివృద్ధి చేస్తారన్నారు. సందర్శకులకు స్నేహపూర్వక వాతావరణం అందించేలా, రక్షిత స్మారక చిహ్నాల వద్ద వివిధ సౌకర్యాలను అభివృద్ధి చేస్తారన్నారు. ఒకవేళ ఏదైనా స్మారక చిహ్నాలు, లేదా ప్రాంతాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలంటే సంబంధిత రాష్ట్రాలు లేదా సంస్థలు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. స్మారక చిహ్నాల రక్షణ ప్రతిపాదనలను పరిశీలించడం అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రస్తుతానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. వన్ఎమ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పర్యాటక సౌకర్యాల పెంపుదల కోసం మొత్తం 100 ఆదర్శ్ స్మారక ప్రాంతాలను గుర్తించినట్లు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
What's Your Reaction?






