ఏపీ వరద నష్టం రూ 6.882 కోట్లు.. ప్రాథమిక అంచనా సిద్ధం చేసిన ప్రభుత్వం

ఏపీలో వరద నష్టం రూ.6,882 కోట్లు.... ప్రాథమిక అంచనా సిద్ధం చేసిన ప్రభుత్వం
అమరావతి, జనసాక్షి : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది.
ఆర్‌అండ్‌బీకి రూ.2,164.5 కోట్లు, నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్‌శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యానశాఖకు 39.9 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ.2 కోట్లు'' నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు...
What's Your Reaction?






