ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్ సీపీ దూరం
ఏపీలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్సార్ సీపీ దూరంగా ఉంటుందని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్ని నాని వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డితో గురువారం సమావేశం అయ్యారు. అనంతరం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.