రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20 వ తేదీ వరకు పల్లె పండుగ- పంచాయితీ వారోత్సవాలు

జనసాక్షి : రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు ‘పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు’ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాలలో ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించటం, సుస్థిర ఆస్తుల ఏర్పాటు చేసి జీవనోపాధులు మెరుగు పరచటం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలన్నారు. పని కోరిన 15 రోజులలో పని పొందే హక్కు, లేనట్లైతే నిరుద్యోగ భృతి, పని ప్రదేశం నివాసాసిని 5 కి.మీ.కంటే దూరం ఉంటే రోజూ కూలీకి అదనoగా 10% వేతనం, పని ప్రదేశాల్లో ప్రథమచికిత్స, త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతన రేటు రూ. 300 ఇవ్వడం, పని ప్రదేశంలో కూలి మరణించిన లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైన ఆ కుటుంబానికి రూ.50,000/- నష్ట పరిహారం వంటి హక్కులను వారికి అందించాలని సూచించారు.
-13,326 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా గ్రామసభలు.
ఆగష్టు 23వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో మునుపెన్నడూ లేని విధంగా అందరి సహకారంతో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించాం. ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం. ఈ కార్యక్రమం మీ అందరి సహకారoతో చేయగలిగాం. అందుకుగాను మీ అందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఉపాధి హామీ పథకంలో మే 20వ తేదీ నుండి పెండింగ్ ఉన్న కూలీల వేతనాలను రూ. 2081 కోట్లను చెల్లించాం.
-రూ. 4500 కోట్ల పనులకు గ్రామసభల ఆమోదం
ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా రూ. 4500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నారు. ఈ 100 రోజుల్లో మీ అందరి సహకారంతో ఉపాధి హామీ కూలీలకు 466.13 లక్షల పనిదినాలను కల్పించడoతో పాటు, 1.07 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలని పూర్తి చేశాం. అలాగే 46,745 ఎకరాల రైతు భూముల్లో ఉద్యానవన పంటల మొక్కలు నాటిoచాం. గ్రామ సభల తీర్మానాల ఆధారంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరుకు 26715 పనులకు 2239 కోట్ల రూపాయలకు జిల్లా కల్లెక్టర్లు పరిపాలన ఆమోదం ఇచ్చారు. మిగిలిన 474 కోట్ల రూపాయల పనులకు పరిపాలన ఆమోదం త్వరితగతిన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపడతాము.
What's Your Reaction?






