అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

Dec 15, 2024 - 17:58
 0  28
అమరజీవి  పొట్టి శ్రీరాములకు  ఘన నివాళి

 కందుకూరు నియోజకవర్గం  వైసీపీ  కార్యాలయంలో   స్వాతంత్ర సమరయోధుడు,ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన అమర జీవి శ్రీపొట్టి శ్రీరాములు 42వ వర్ధంతి వేడుకలు  ఆదివారం ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అమర   జీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు  వైసీపీ నేతలు   మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రంగా ఉండాలని నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు శ్రీపొట్టి శ్రీరాములని కొనియాడారు . ఆంధ్రులు ఆరంభసూరులనే నానుడని చెరిపి వేస్తూ ఆత్మార్పణ చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణను సాకారం చేసిన త్యాగజీవి శ్రీపొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన త్యాగఫలమే నేడు తెలుగు జాతి అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రాలని పేర్కొన్నారు. అమరజీవి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లీ సమాజ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్, వైసీపీ కందుకూరు   నియోజకవర్గ ఇంచార్జ్      మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రావులకొల్లు బ్రహ్మానందం,గణేశం.గంగిరెడ్డి,పాశంకొండయ్య,రేణమాల.అయ్యన్,  వల్లూరి.కోటేశ్వరరావు,షేక్.రహీం, కూరపాటి వెంకట్రామిరెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు, ద్రోణాదుల చైతన్య, షేక్.రిజ్వాన్, జంగిలి.ఇశ్రాయేలు, కొచ్చర్ల.మాల్యాద్రి, శ్రీరామ కుమారస్వామి, సుల్తాన్, కె.సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కలాం  ,జి. ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow