శ్రీనివాస కల్యాణోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం

Mar 14, 2025 - 19:15
Mar 14, 2025 - 19:16
 0  337
శ్రీనివాస కల్యాణోత్సవానికి  చంద్రబాబుకు ఆహ్వానం

శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంకు ఆహ్వానం

అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న వేంకటేశ్వరస్వామివారికి శనివారం నిర్వహించనున్న కల్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు ని... తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు, ఆలయ ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి, బోర్డు మెంబర్‌, కోవూరు ఎమ్మెల్యే  వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గార్లు, ఇతర సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శనివారం వెంకటపాలంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow