ఏపీ పోలీస్ శాఖకు కేంద్ర పురస్కారం

Sep 11, 2024 - 17:25
 0  22
ఏపీ పోలీస్ శాఖకు  కేంద్ర పురస్కారం

ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం

ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు

అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం ప్రదానం

సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ అందజేత

 జనసాక్షి  : ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది.ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమం లో కేంద్రహోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కో ఆర్టినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’‌ను అందజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow