6675 కోట్లతో టాటా పవర్ ప్లాంట్ కేటాయించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ
6675 కోట్లతో టాటా పవర్ ప్లాంట్ కేటాయించిన సీఎం చంద్రబాబు కి ధన్యవాదాలు - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరులోని IFFCO kisan SEZ లో టాటా సంస్థ 6675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుండటం హర్షించదగ్గ విషయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ పరిశ్రమను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏళ్లుగా ఎలాంటి పురోగతిలేని ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ ప్రాంత పారిశ్రామిక పురోగతికి టాటా పవర్ ప్లాంట్ ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని, ఇది సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. దేశీయ సౌర పరికరాల తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. చైనా నుంచి దిగుమతి తగ్గించుకోవడానికి భారీ ప్రాజెక్టును ఏపీలో నెలకొల్పేందుకు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) నిర్ణయం తీసుకోగా దేశంలోనే అతిపెద్దదైన 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ ప్లాంట్ గా ఇది నిలవనుందన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి, కూటమి పెద్దలకు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
What's Your Reaction?