కర్నూలు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వేమిరెడ్డి

Oct 24, 2025 - 10:17
 0  30

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వేమిరెడ్డి

- ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు మృతిచెందడం విచారకరం

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటీకూరు సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రంగా కలచి వేసిందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది మృత్యువాత పడటం ఆవేదనకు గురిచేసిందని, అందులో నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమేష్, అనూషతో సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందటం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనమైన విషయం హృదయవిదారకమని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow