సంగం బ్యారేజ్ కి కొట్టుకు వచ్చిన 30 టన్నుల బోటును ఒడ్డుకు చేర్చిన యంత్రాంగం
సంగం బ్యారేజ్ కు తప్పిన ముప్పు
చాకచక్యంగా ఒడ్డుకు చేర్చిన యంత్రాంగం
నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ కు మోంతా తుఫాను భారీ వర్షాలకు కొట్టుకు వచ్చిన 30 టన్నుల బోటును సమిష్టి కృషితో ఒడ్డుకు చేర్చిన జిల్లా యంత్రాంగం, లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ బోటు ప్రాజెక్టు కు తగిలితే సంగం బ్యారేజ్ ఉనికి ప్రశ్నర్ధకమయ్యేది.ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఆఘమేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.పరిస్థితిని సమీక్షించి హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్.ఎడి ఆర్ ఎఫ్ 30 మంది సభ్యులు, ఎస్ డి ఆర్ ఎఫ్ 30 మంది సభ్యులు, పోలీస్ యంత్రాంగం 100 మంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల నిరంతర కృషి ఫలితంతో బోటును ఒడ్డుకు చేర్చారు. ఈరోజు బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.85 గేట్లతో నిర్మించి, 3,85,000 ఎకరాలు ఆయకట్టు తో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంగం బ్యారేజ్ కు ప్రమాదం జరిగి ఉంటే నీరు వృధాగా పోయేవి. రాబోయే సీజన్ లో రైతులు నష్టపోయేవారు.పొదలకూరు, సంగం గ్రామాలకు బ్రిడ్జ్ గా కూడా ఉపయోగపడుతున్న ఈ బ్యారేజ్ దెబ్బతింటే ఆయా గ్రామాల రాకపోకలు స్థంభించేవి.
What's Your Reaction?