తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వైసీపీ పట్టణ అధ్యక్షులు రఫీ

Jul 23, 2026 - 08:59
Jul 23, 2026 - 09:01
 0  64
తాడేపల్లి లో  మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన  వైసీపీ పట్టణ అధ్యక్షులు రఫీ

తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కందుకూరు వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే రఫీ

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కందుకూరు వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే రఫీ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కందుకూరులో తనకు ఎదురైన సమస్యలు, జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను రఫీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా లీజుకు తీసుకున్న బీఎస్ఎన్ఎల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి తనకు కోటికి పైగా నష్టం వాటిల్లిన విషయాన్ని వివరించినట్లు రఫీ తెలిపారు.తన సమస్యను సానుకూలంగా పరిశీలించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఈ అంశంపై ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు హైకోర్టు న్యాయవాది మనోహర్ రెడ్డికి వివరించి తగిన చర్యలు తీసుకునేలా బాధ్యత అప్పగించినట్లు రఫీ వెల్లడించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow