రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన చల్లా శ్రీనివాసరావు

రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన చల్లా శ్రీనివాసరావు
కందుకూరు జనసాక్షి - ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం మాజీ అధ్యక్షులు, టిడిపి నేత చల్లా శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డిని కలిసిఅభినందనలు తెలియజేశారు. ఆయన తన అనుచరులతో రేవంత్ ఇంటికి చేరుకుని పుష్ప గుచ్చం ఇచ్చి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పటి నుంచి చల్లా శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రావడంతో రేవంత్ రెడ్డిని,చల్లా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
What's Your Reaction?






