రూ 80 వేలకే మోకాళ్ళ కీళ్ల మార్పిడి -- డాక్టర్ సాకేత్

Oct 3, 2023 - 10:30
 0  334
రూ 80 వేలకే   మోకాళ్ళ కీళ్ల మార్పిడి -- డాక్టర్ సాకేత్

 కందుకూరు జనసాక్షి : కందుకూరు కోటారెడ్డి  మల్టీ స్పెషాలిటీ హాస్పటల్లో  రూ 80 వేలకే   కీళ్ళ మార్పిడి చికిత్స  చేస్తున్నట్లు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వి. సాకేత్ తెలిపారు. సోమవారం  విలేకరుల సమావేశం  ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సాకేత్ మాట్లాడుతూ ఒక కాలు కీళ్ల మార్పిడి చికిత్స కు సుమారుగా 1,60 లక్షలు  ఖర్చు అవుతుందని, తమ హాస్పటల్ లో  సగం ధర 80వేలకే చేస్తున్నట్లు తెలిపారు. అధునాతన ప్రముఖ కంపెనీ కీళ్లను ఈ ఆపరేషన్ లో ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ భార్గవ్ ఒక పేషెంట్ కు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. ఆ పేషెంట్ కు  ఆపరేషన్ విజయవంతమైందని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మోకాళ్ళ శాస్త్ర చికిత్స నిర్వహిస్తున్నామని తెలియజేశారు . కార్పొరేట్  హాస్పిటల్ లో వాడే ప్లాంటేషన్ ను వాడుతున్నామని పేర్కొన్నారు. పేషంటు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారో రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా అదేవిధంగా  ఉండొచ్చునని  తెలియజేశారు. దీర్ఘకాలికమైన  కీళ్లవాతమునకు తమ హాస్పిటల్ లో 30% తగ్గింపుతో మందులు సరఫరా చేస్తామని తెలిపారు. తమ తాతగారైన కోటారెడ్డి చేసిన ప్రజాసేవలో తమ వంతు పేదలకు సహాయం చేద్దామని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow