ఫ్రీ మెచ్యూర్ శిశువుకు ప్రాణం పోసిన కందుకూరు శక్తి చిల్డ్రన్ హాస్పిటల్

Sep 20, 2026 - 17:51
 0  22
ఫ్రీ మెచ్యూర్  శిశువుకు  ప్రాణం పోసిన కందుకూరు శక్తి చిల్డ్రన్ హాస్పిటల్

26 వారాలకే జన్మించిన శిశువుకు విజయవంతమైన చికిత్స

అత్యంత సవాలుతో కూడిన ప్రీమెచ్యూర్ కేసును విజయవంతంగా నిర్వహించిన కందుకూరు శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్

 కందుకూరు శిఖర జనసాక్షి : కేవలం 26 వారాలకే జన్మించిన అత్యంత తక్కువ బరువున్న ప్రీమెచ్యూర్ శిశువుకు 45 రోజుల పాటు ప్రత్యేక ఐసీయూ చికిత్స అందించి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్‌కు సిద్ధం చేసిన ఘనతను కందుకూరులోని శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్ సాధించింది. అత్యంత సున్నితమైన ఈ కేసును చిన్నపిల్లల ఐసీయూ వైద్యుల బృందం సమర్థవంతంగా నిర్వహించింది.ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కందుకూరు శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్ చిన్నపిల్లల ఐసీయూ వైద్యులు డాక్టర్ కె.వి. అశోక్ చౌదరి చికిత్స వివరాలను వెల్లడించారు.నీలిమ అనే గర్భిణికి నవంబర్ 2న ప్రసవ తేదీ ఉండగా, ముందుగానే ఆగస్టు 4న ప్రసవ నొప్పులు రావడంతో కందుకూరులోని ఓ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం ద్వారా శిశువు జన్మించినట్లు డాక్టర్ తెలిపారు. సాధారణంగా సుమారు 40 వారాల గర్భధారణ తర్వాత జన్మించాల్సిన శిశువు కేవలం 26 వారాలకే జన్మించడంతో, తక్కువ బరువుతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని వివరించారు.శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో 45 రోజుల ప్రత్యేక ఐసీయూ చికిత్స శిశువును శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించి 45 రోజుల పాటు ప్రత్యేక ఐసీయూలో నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స అందించినట్లు డాక్టర్ అశోక్ చౌదరి తెలిపారు.శిశువుకు 10 రోజుల పాటు వెంటిలేటర్ సహాయం, గుండెకు సంబంధించిన సమస్యలకు చికిత్స, రక్తహీనతకు వైద్యం అందించడంతో పాటు అవసరమైన సమయంలో మూడు సార్లు రక్తం ఎక్కించినట్లు వెల్లడించారు.ఈ కేసులో ప్రత్యేకంగా 45 రోజుల ఐసీయూ చికిత్సలో 39 రోజుల పాటు యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా శిశువును నిర్వహించగలిగామని డాక్టర్ అశోక్ చౌదరి తెలిపారు.ఈ విజయం వెనుక డబ్బు కాదు.. మా వైద్య బృందం, తల్లిదండ్రుల సహకారమే మా బలం అని డాక్టర్ అశోక్ చౌదరి పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చికిత్స ఖర్చులో రాయితీ కూడా కల్పించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వైద్య సేవలతో పాటు మానవతా దృక్పథంతో కుటుంబానికి అండగా నిలిచామని పేర్కొన్నారు.

26 వారాలకే జన్మించిన శిశువును అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ 45 రోజుల ఐసీయూ చికిత్స అనంతరం ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్‌కు సిద్ధం చేయడం శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందానికి ఒక ముఖ్యమైన వైద్య విజయంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్, శిశువు తల్లిదండ్రులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow