ప్రభుత్వ విద్యా రంగ పునాదులు పటిష్టం చేయండి - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

ప్రభుత్వ విద్యా రంగ పునాదులు పటిష్టం చేయండి
మన బడి- మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే ప్రశాంతి ధన్యవాదాలు తెలియచేసారు. మంగళవారం ఆమె శాసనసభలో క్షేత్ర స్థాయిలో విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునాది బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుంది అన్నట్టు బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు.పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యా బోధన అందిస్తే విద్యార్థుల భవిష్యత్ బావుంటుందన్నారు. విద్యారంగంలో విన్నూత్న సంస్కరణలు చేస్తూ ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికే అని చేతల్లో చూపుతున్న మంత్రి నారా లోకేష్ ని ఆమె అభినందించారు. విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులను ఒకే వేదికపై తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ విద్యా రంగాన్ని మంత్రి లోకేష్ బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. జీవో నెంబర్ 117 రద్దుతో పాఠశాల విద్యకు ఊపిరి పోశారని అలాగే మనబడి మన భవిషత్తు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులు త్వరతగతిని పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య
అందించడంపై మహారాష్ట్రలో మజి శిక్వాన్, ఢిల్లీలో ‘శిక్షా జాగృత అభియాన్’ అనే కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్న తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉపాధ్యాయులకు అధునాతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనిసూచించారు. 2027 నాటికి మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠాశాలలో విద్యుత్ సౌకర్యం, సురక్షిత త్రాగునీరు అందించడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
What's Your Reaction?






