పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Sep 6, 2024 - 11:54
Sep 6, 2024 - 12:02
 0  390
పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత-- సీఐ కె.వెంకటేశ్వరరావు

-మట్టి వినాయకుల ప్రతిమలను సీఐ చేతుల మీదుగా పంపిణీ

కందుకూరు జనసాక్షి  : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యత అని కందుకూరు సీఐ కె.వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని పెద్ద బజారుజాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బోణాల చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీ ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి మట్టి విగ్రహాన్ని డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ప్రతి ఒక్కరు   వినాయక చవితి పర్వదిన సందర్భంగా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన బోణాల చక్రవర్తి కుటుంబ సభ్యులను సీఐ అభినందించారు.అంతకుముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఐని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇస్కాల సురేంద్ర ఆధ్వర్యంలో అల్పాహారంఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మురారి శెట్టి సుధీర్,కొత్తూరి సుధాకర్ రావు, కోటా కిషోర్,చక్కా వెంకట కేశవరావు,కాకుమాని ప్రవీణ్ కుమార్, కోట వెంకట నరసింహం,తాతా లక్ష్మీనారాయణ,నల్లమల్లి వెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి వరదరాజ, ఇస్కాల మధుసూదన్ రావు, ఇన్నమూరి శ్రీను,చీదెండ్ల కృష్ణ,మురారి శెట్టి చిన్ని కృష్ణ,నల్లమల్లి ప్రసాద్,ఇస్కాల సురేంద్ర,పేటేటి కృష్ణ,గుర్రం అల్లూరయ్య, కంకణాల వెంకటేశ్వర్లు తదితర ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow