సీఎం సహాయ నిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం రూ 5 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకి అందించారు

Sep 5, 2024 - 12:43
 0  431
సీఎం సహాయ నిధికి  ఐఏఎస్  అధికారుల భార్యల సంఘం  రూ 5 లక్షల  చెక్కును  సీఎం చంద్రబాబుకి  అందించారు

సీఎం సహాయ నిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం రూ 5 లక్షల  చెక్కు సీఎంకు అందించారు.

 జనసాక్షి  విజయవాడ,5 సెప్టెంబరు: రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం(IASOWA) ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సీఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి,ప్రదా భాస్కర్ తదితరులు సీఎం ను కలిసి చెక్కును అందజేశారు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి అందించడం పట్ల రాష్ట్ర ప్రజలందరి తరపున ఆసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow