నెల్లూరు జిల్లా లో రహదారుల అభివృద్ధికి సహకరించండి- ఎంపీ

నెల్లూరు జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించండి
- కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వేమిరెడ్డి వినతులు
- కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయండి
- దుత్తలూరు- కావలి రోడ్డు పనుల్లో వేగం పెరిగేలా అధికారులను ఆదేశించండి
- రాజుపాలెం నుంచి రామాయపట్నం పోర్టు వరకు రహదారిని అభివృద్దఙ చేయండి
- ఎంపీ వేమిరెడ్డి వినతులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
- కావలి బైపాస్ రోడ్డుకు ఓకే. దుత్తలూరు-కావలి రోడ్ల పనులు వేగవంతం అయ్యేలా చర్యలు
నెల్లూరు జిల్లాలో రహదారుల అభివృద్ధే ధ్యేయంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కృషి చేస్తున్నారు. జిల్లాలో రహదారులకు సంబంధించి పలు అంశాలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్దికి కృషి చేయాలని వినతి సమర్పించారు. ఎంపీ వేమిరెడ్డి వినతులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
-కావలి పట్టణం పశ్చిమం వైపు బైపాస్ ఏర్పాటు చేయండి..
కావలి నియోజకవర్గం కావలి మండలంలో 2 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారన్నారు. సమీప మండలాల్లో మరో 3 లక్షల జనాభా నివసిస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. ప్రజలు తమ వివిధ అవసరాల నిమిత్తం కావలి పట్టణానికి వస్తుంటారని, దాంతో పాటు కావలి టౌన్ గుండా భారీ వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయన్నారు. దాంతో టౌన్‌లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో స్థానిక ప్రజలు, టౌన్‌కు వచ్చే సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా NH-16 నుండి కావలి-దుత్తలూరు రహదారిని (NH-167 BG వద్ద) అనుసంధానిస్తూ కావలి టౌన్‌కి పశ్చిమాన ఒక బైపాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ వేమిరెడ్డి వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కావలి టౌన్ పశ్చిమాన బైపాస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కావలి- దుత్తలూరు రోడ్డు పనులు వేగవంతం చేయండి..
అలాగే దుత్తలూరు (NH-167 BG జంక్షన్ వద్ద) నుండి కావలి వద్ద NH-16లో కలిపేలా నిర్మిస్తున్న రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. NH-167 BGకి 101 కి.మీ పశ్చిమం వైపున కావలి పట్టణం ఎంట్రన్స్ నుండి NH-167 BGలో కొనసాగుతున్న పనిలో డ్రైన్ నుండి డ్రెయిన్ వరకు తప్పనిసరిగా CC పేవర్ వేయించాలని కోరారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం తగ్గి ప్రమాదాలు నివారించే వీలుంటుందని వివరించారు. కాబట్టి రహదారి పనులను వేగవంతం చేసేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డ్రెయిన్ టు డ్రెయిన్ వరకు CC పేవర్‌ను అందించే పనిని మంజూరు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తప్పకుండా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
-రామాయపట్నం పోర్టుకు రహదారిని విస్తరించండి..
జిల్లాలో రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా రామాయపట్నం ఓడరేవు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీదుగా NH వరకు ఉన్న R&B రహదారిని NH వరకు CRIF కింద అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి విన్నవించారు. ఈ రహదారి ఏర్పడితే రామాయపట్నం ఓడరేవు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి NH-16 కి లాజిస్టిక్ ఎగుమతులు సులభతరం అవుతాయని వివరించారు. అలాగే జిల్లా తీరప్రాంత గ్రామాలలో నివసించే మత్స్యకారులకు రవాణా సౌకర్యం మెరుగుపడి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన కేంద్రమంత్రి.. రహదారి విస్తరణపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
What's Your Reaction?






