కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ 15వేల కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Jul 23, 2024 - 15:08
 0  103
కేంద్ర బడ్జెట్లో  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి  రూ 15వేల కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

అన్ని ప్రాంతాల, అన్ని రంగాల అభివృద్ధికి, కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టిన కూటమి ప్రభుత్వం. ఫలించిన చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి లభించిన హామీలు.

1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం

2. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు 

3. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ 

4. పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి

5. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం

6. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి 

7. విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు 

8. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు 

9. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు 

10. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow