తుఫాను దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండాలి

జనసాక్షి : తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గారు చిల్లకూరు, కోట , వాకాడు , మండలం లో గ్రామాలను తనికీ నిర్వహించి రేషన్ పంపిణిని పరిశీలించి తుఫాను దృష్టా ఎక్కడ కూడా రేషన్ పంపిణి ఆపడానికి లేదని, అందరు తహసీల్దార్లు రేషన్ పంపిణి సకాలంలో పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. తుఫాను దృష్ట్యా
అందరు అధికారులు అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుంటే వెంటనే తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గర్భినులను, దీర్ఘకాళిక రోగులను పరిశీలించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసారు. త్రాగు నీరు సరఫరా, విధ్యుత్ సరఫరా కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
What's Your Reaction?






