ట్రావెల్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు - 8 మందికి గాయాలు

Jun 16, 2026 - 20:08
Jun 16, 2026 - 20:10
 0  43
ట్రావెల్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు - 8 మందికి గాయాలు

ట్రావెల్ బస్సును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు -8 మందికి గాయాలు

 గుడ్లూరు శిఖర జనసాక్షి :

 రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఎనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 8 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై తెట్టు - శాంతినగర్ గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ప్రకారం భార్గవ్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఏలూరు నుంచి వేలాంగణికి ప్రయాణికులతో వెళుతూ తెట్టు - శాంతినగర్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక వైపు ఢీ కొట్టింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఉన్న గంజి కోట ధనలక్ష్మి, జన సూత్రపు రాజేశ్వరి, రేష్మ, రాధమ్మ, నాగమణి, మార్తమ్మ, జయరాం, సుబ్బారావులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకట్రావు తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలముకు చేరుకొని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow