ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు - ప్రశంసా పత్రాలు అందజేసిన జాయింట్ కలెక్టర్
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రశంసాపత్రాల అందజేత.
-సామాజిక బాధ్యతగా ప్రోత్సాహకాలు అందిస్తున్న 'క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్' సంస్థని అభినందించిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ విద్యాభ్యాసంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్లో ని జాయింట్ కలెక్టర్ చాంబర్లో 'క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్', 'క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక చేసిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రశంసాపత్రాలను ఆమె చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపి, భవిష్యత్తులో మంచి లక్ష్యాలను సాధించేలా దోహదపడతాయని ఆమె చెప్పారు .విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనీ ఆమె ఆకాంక్షించారు.చీరాల, ఒంగోలు ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 10,000 చొప్పున ఆర్థిక సాయంతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఎ. దివ్య హర్షిత, పి. ధనలక్ష్మి,కె. ఉదయభార్గవి,ఎం. స్మైలీ . ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ తరఫున డివిజనల్ మేనేజర్ ఎం. జగదీష్, ఏరియా మేనేజర్ శేగు వెంకట గిరిబాబు,
సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?