విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన
విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కోసం...
జనసాక్షి ,సింగరాయకొండ, జూలై 28: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల విధానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సింగరాయకొండలోని గీతం ఒలంపియాడ్ స్కూల్లో సాధారణ ఎన్నికల తరహాలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలను నిర్వహించారు.ఈ ఎన్నికల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అసిస్టెంట్ హెడ్ బాయ్, అసిస్టెంట్ హెడ్ గర్ల్ పదవులతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివిధ విభాగాల ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకునేలా ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, బ్యాలెట్ విధానం, ఓటు హక్కు వినియోగం, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, ప్రజాస్వామ్య విలువలను అలవర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అందులో భాగంగానే పాఠశాల స్థాయిలో ఎన్నికల తరహా ప్రక్రియను నిర్వహించి, భారత ఎన్నికల వ్యవస్థపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?