నీట్ పరీక్షకు భద్రతా ఏర్పాట్లు పూర్తి ఎస్పీ హర్షవర్ధన్ రాజు
- నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ . హర్షవర్ధన్ రాజు
-పరీక్ష నియమ నిబంధలు ఉల్లంఘనకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు: -ఒంగోలులో 6 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 1,821 మంది విద్యార్థులు హాజరుకానున్నారు
-ఆరు పరీక్షా కేంద్రాల వద్ద ఒక్కో కేంద్రానికి ఒక సీఐ, ఒక ఎస్ఐను నియమించి, మొత్తం 100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు మరియు ప్రత్యేక నిఘా -నీట్ పరీక్ష నిమిత్తం విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్‌ను ఏర్పాటు చేసిన ఎస్పీ
జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పునఃపరీక్ష సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియచేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు ప్రకాశం జిల్లాలో మొత్తం 1821 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒంగోలులో 6 పరీక్షా కేంద్రాల 1821 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఒక్కొక్క సెంటర్ వద్ద ఒక సీఐ, ఒక ఎస్ ఐలను నియమించడం జరిగిందన్నారు. ఆరు పరీక్ష కేంద్రల వద్ద ఓవరల్ గా 100 మంది పోలీసులు సిబ్బంది తో పటిష్ఠమైన బందోబస్తు ఎర్పాటు చేయడం చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో తల్లిదండ్రులు, బంధువులు గుమికూడకుండా సహకరించాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, పరీక్ష నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు హాల్ టిక్కెట్స్ లో సూచించిన నియమ, నిబంధనలు విద్యార్థులు కుణ్ణంగా చదువుకొని, వాటిని పాటించాలన్నారు. ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, నీట్ పరీక్ష నిమిత్తం విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎలాంటి అవకతవకలు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగినా వెంటనే DIAL-100/112 లేదా జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు
What's Your Reaction?