డాక్టర్ ఇంద్రాణిని మర్యాదపూర్వకంగా కలిసిన కందుకూరు వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు

Dec 12, 2025 - 16:47
Dec 12, 2025 - 16:58
 0  204
డాక్టర్  ఇంద్రాణిని మర్యాదపూర్వకంగా కలిసిన కందుకూరు వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు

ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా :ఇంద్రాణి ని మర్యాద పూర్వకంగా కలసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు.

  కందుకూరు ఏరియా ఆసుపత్రికి ఇటీవల నూతనంగా   సూపరింటెండెంట్ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఇంద్రాణిని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గడ్డం  మాలకొండయ్య, మువ్వల భూషయ్య, శిఖా తిరుపాలులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలసి శుభాభినందనలు తెలిపారు. ఈ నెలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరుగు అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై సూపరింటెండెంట్ గారితో చర్చించడం, ఆసుపత్రి అభివృద్ధి కోసం, రోగులు, వారి సహాయకుల కోసం తీసుకోవలసిన వసతుల చర్చించినట్లు వారు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow