జన సందోహం మధ్య ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్

Apr 23, 2024 - 18:04
Apr 23, 2024 - 18:15
 0  538
జన సందోహం మధ్య  ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్

జన సందోహం మధ్య ఇంటూరి నాగేశ్వరరావు  నామినేషన్

- ముఖ్యఅతిథిగా పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్  ఎ న్ డి ఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి   ప్రభాకర్ రెడ్డి 

- అంకమ్మ తల్లి ఆశీస్సులతో నాగేశ్వరరావు  తప్పకుండా గెలుస్తారని వ్యాఖ్య 

జనసాక్షి :  భారీ జన సందోహం మధ్య కందుకూరు నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు  నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ ఎ న్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి   ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. 

నామినేషన్ సందర్భంగా కందుకూరు పట్టణమంతా పసుపుమయమైంది. మూడు పార్టీల జెండాలతో పట్టణ వీధులు కళకళలాడాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడంతో నామినేషన్ కార్యక్రమం ప్రభంజనాన్ని తలపించింది. అనంతరం కందుకూరులోని  సబ్ కలెక్టర్  కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 

నామినేషన్ అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ.. కందుకూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఇంటూరి నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. అంకమ్మ తల్లి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో ఈ ఎన్నికల్లో నాగేశ్వరరావు  ఘనవిజయం సాధిస్తారని అన్నారు. ఇంతమంది ప్రజలను చూస్తుంటే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఖాయమైందన్నారు. అలాగే తాను కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని, ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కందుకూరు నియోజక వర్గానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటారని స్పష్టం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow