ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రకాశం జనసాక్షి : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బుధవారం స్థానిక సాహితీవేత్త, శ్రీశ్రీ కళావేదిక ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని 1999లో యునెస్కో ప్రకటించిందని, 2000, ఫిబ్రవరి 21 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది, బంగ్లాదేశీయులు (తూర్పు పాకిస్థానీయులు) చేసిన బెంగాలీ భాషా ఉద్యమానికి నివాళిగా దీనిని నిర్వహిస్తున్నారని, తెలుగు అక్షరాల్లోని ఒంపు సొంపుల ముందు అప్సరసల అందం వెలవెల బోతోoది, పరభాషా పల్లకిని బానిసల్లా మోస్తున్న ప్రజలారా, స్వభాషా పల్లకిలో రాజులా కూర్చునే అదృష్టం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
What's Your Reaction?






