అనివేటి మండప నిర్మాణానికి రూ 25 వేలు విరాళం.
జనసాక్షి : అనివేటి మండప అనివేటి మండప నిర్మాణానికి రూ 25 వేలు విరాళం.
కందుదుకూరు గ్రామ దేవత భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయ పున : నిర్మాణం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 6 కోట్లతో జీర్ణోద్ధరణ జరిగింది. దేవాలయానికి అదనపు శోభ తెచ్చే విధంగా ఆలయం ముందు 4 కోట్లతో అనివేటి మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పిలుపుతో భక్తులు, దాతలు తమ శక్తి కొలది విరాళాలను సమర్పిస్తున్నారు. శనివారం కందుకూరు వాసి, ప్రస్తుత గుంటూరు నివాసి, విశ్రాంత కందుకూరు టి ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సింగంపల్లి వెంకటేశ్వర్లు ధర్మపత్ని పద్మావతి వారి కుమారులు రవికుమార్, చంద్రశేఖర్ లు విప్పగుంట మాధవరావు ద్వారా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సమక్షంలో కమిటీ సభ్యులకు 25 వేలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మంచి రాజు మురళి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ముందు అనివేటి మండపం నిర్మాణానికి సహకరించిన వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు వెళ్లవేలలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూరం వేణుగోపాల్ రెడ్డి, కొడాలి కోటేశ్వరరావు ఉన్నారు.
What's Your Reaction?






