ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనికి

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం అమ్మ చేతి వంటను తలపించేలా వుండాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరులోని జెట్టి బలరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా వున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరిశీలించారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఆవిడే స్వహస్తాలతో భోజనం వడ్డించారు. విద్యార్థినులతో కలిసి భోంచేసారు. శుచి, శుభ్రత పాటించాలని ఆమె మధ్యాహ్న భోజన పధక నిర్వాహకులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పధకంలో నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల నుంచి కానీ వారి తల్లి తండ్రుల నుంచి కానీ ఫిర్యాదుల రాకుండా చూసుకోవాల్సిన మీదేనని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడైనా పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పధకం అమలు తీరును పర్వేక్షించాలని కోరారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






