సుందరయ్య నగర్ కాలనీ ప్రజలకు తీరిన మంచి నీటి కష్టాలు

సుందరయ్య నగర్ కాలనీ మంచి నీటి కష్టాలను తీర్చిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
జనసాక్షి : కందుకూరు పట్టణంలోని 6వ వార్డు సుందరయ్య నగర్ కాలనీలో నూతనంగాా ఏర్పాటుచేసిన మంచినీటి పబ్లిక్ కుళాయిలు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.గత దశాబ్ద కాలంగా సుందరయ్య నగర్ లో ఉన్న మంచి నీటి సమస్యకు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పరిష్కారం చూపలేదని, కానీ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరయ్య నగర్ కు వచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు కి స్థానిక ప్రజలు సమస్యలు చెప్పుకోగా అధికారంలోకి రాగానే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక వాటర్ పైప్ లైన్ ద్వారా పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందజేసిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సుందరయ్య నగర మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుందరయ్య నగర్ లో అన్ని మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని, వర్షాకాలంలో కాలనీ నీటి ముంపుకు గురి కాకుండా ప్రత్యేక స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ద్వారా నీటి మరలించి కాలనీ ముప్పుకు గురికాకుండా చేస్తానని ఎమ్మెల్యే స్థానికులకు తెలిపారు...ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షులు అహ్మద్ బాషా, మున్సిపల్ కమిషనర్ కే అనూష , మున్సిపల్ డి.ఈ గణపతి, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, చిలకపాటి మధు, షేక్ మున్నా, షేక్ ఫిరోజ్, షేక్ రూబీ, షేక్ సలాం, ముచ్చు శ్రీను,గడ్డం మాలకొండయ్య, చుండూరి శ్రీను మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
What's Your Reaction?






