చంపావతి నదిపై ఉన్న రక్షిత మంచినీటి పథకం పంపు హౌస్ ను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Oct 21, 2024 - 13:29
Oct 21, 2024 - 13:33
 0  86
చంపావతి నదిపై ఉన్న  రక్షిత మంచినీటి పథకం పంపు హౌస్ ను  పరిశీలించిన ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్

జనసాక్షి  :విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నది పై ఉన్న రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచి నీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ అవుతుంది అన్న దానిపై శ్రీ పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జల వనరుల శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. పాతకాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు వినియోగించుకుని గ్రామీణలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నీటి కాలుష్యాన్ని గల కారణాలు తెలుసుకోవాలని, దాని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow