తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించిన ఎంపీ మా గుంట శ్రీనివాసులు రెడ్డి

తన మీద వస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎంపీ మాగుంట
జనసాక్షి : తాను వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో (ఇంస్ట్రాగ్రామ్ మరియు ఫేస్ బుక్) జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఖండించారు. నేను ఎప్పటికి వైసీపీ వెన్నంటే ఉంటా.. కొత్త సంవత్సరంలో టీడీపీలోకి వెళ్తానన్న మాట ఆవాస్తవం అని ఎంపీ మాగుంట స్పష్టం చేశారు . దీని పై జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారంతో తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. కావున ఈ అసత్య ప్రచారం చేసిన వారిని సత్వరమే కనిపెట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మాగుంట పోలీసుల్ని కోరారు. ఈ విషయంలో మీరు తీసుకున్న చర్యల్ని నాకు తెలియజేయాలని కూడా పోలీసుల్ని ఆయన కోరారు.
What's Your Reaction?






