శ్రీ అంకమ్మ తల్లి ఆలయ నూతన ఈఓ గా పి. కార్తీక్ బాధ్యతల స్వీకరణ

జనసాక్షి : కందుకూరు గ్రామదేవత ఆదిపరాశక్తి శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయ నూతన ఈఓగా పి. కార్తీక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న పి.కృష్ణవేణి సింగరాయకొండకు బదిలీపై వెళ్లారు. ప్రభుత్వ ప్రకాశం జిల్లా గుంటిగంగ ఈఓ గా పనిచేస్తున్న పి.కార్తీక్ ను అంకమ్మ తల్లి దేవాలయం ఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన అంకమ్మ తల్లి ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ అర్చకులు నూతన ఈఓకి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం, వేద ఆశీర్వచనం అందజేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈఓ కార్తీక్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అమ్మవారికి జరిగే కైంకర్యాలన్ని వైభవంగా జరిపిస్తానని తెలియజేశారు.
What's Your Reaction?






