శాఖవరం పరిధిలో రైతులతో కలసి శనగ పంటను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

Feb 28, 2025 - 16:20
Feb 28, 2025 - 16:30
 0  60
శాఖవరం పరిధిలో   రైతులతో కలసి శనగ పంటను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

వలేటివారిపాలెం మండలంలోని శాఖవరం గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్, కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పి. అనసూయ రైతులతో కలిసి శనగ పంట పొలాలను  శుక్రవారం  పరిశీలించారు. ప్రస్తుతం శనగ పంట పూత, కాయ దశలో ఉందని, శనగలో మొదలు కుళ్ళు , వేరు కుళ్ళు తెలుగు ఉందన్నారు. దీని నివారణకు తెగుళ్ళు సోకిన పొలాల్లో పంట మార్పిడి (జొన్న, సజ్జ, కొర్ర)చేసుకోవాలని తెలిపారు.ఉదృతి ఎక్కువ కాకుండా ఎకరాకు 200గ్రాములు కార్బన్ , డై జిమ్,  600 గ్రాముల మాన్కోజెబ్ లేదా ట్రైకో డేర్మా విరీడి 5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని సూచించారు శాఖవరం గ్రామంలో శనగ పంటలో గ్యాప్ పొలంబడి నిర్వహించడం జరుగుతుంది  ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలు తో పంటను సాగు చేస్తారు కోత అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా శనగ పంటను మార్కెట్ ధర కంటే 20 నుంచి 30 శాతం అధిక అధిక ధరతో కొనుగోలు చేస్తారని తెలిపారు.వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం,  కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి రైతుకి ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య(యూనిక్ నెంబర్)ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని సులభతరం చేసి పారదర్శకంగా సేవలను అందించడం కోసం చేయడుతున్న బృహ హత్కరమైన రైతు ప్రత్యేక విశిష్ట సంఖ్య (యూనిక్ నెంబర్)నమోదు కార్యక్రమం అని తెలియజేసారు, కావున రైతులు మీ సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు ఆధార కార్డు,పట్టాదారు పాసు పుస్తకాలు, మొబైల్ నెంబర్ తీసుకొని ప్రత్యేక పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేసుకొన్ని తర్వాత ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య పొందవచ్చునని, తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే వివిధ రకాల పథకాలు,రాయితీలు, పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ, యంత్ర పరికరాలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలు, తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు, అలాగే రైతులు అందరూ తప్పనిసరిగా రబీ సీజన్లో వేసిన ప్రతి పంటను పంట నమోదు చేసుకోవాలని అలాగే కె వై సి చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కందుకూరు సాంకేతిక వ్యవసాయ అధికారి పి .దుర్గా మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు వై . ప్రభూ గ్రామ రైతులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow