ఈ నెల 4 వ తేదీన నెల్లూరుకు రానున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి

నెల్లూరు జన సాక్షి :మాజీ ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి జులై 4వ తేదీ, గురువారం ఉదయం 10:30 గంటలకు నెల్లూరుకు రానున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఉదయం 9-40 గంటలకు హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి నుండి బయలుదేరి 10:30 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని హెలిప్యాడ్ కు చేరుకొని, అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 12-00 గంటలకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని హెలికాప్టర్ లో తాడేపల్లికి బయలుదేరుతారు.
What's Your Reaction?






