వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపిన టీడీ పీ నాయకులు ఇంటూరి రాజేష్, దివి రమేష్

వి.పి.ఆర్ గారికి మద్దతు పలికిన కందుకూరు టీడీపీ నాయకులు
నెల్లూరు జనసాక్షి : శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారికి కందుకూరుకు చెందిన దివి రమేష్, ఇంటూరి రాజేష్ గారి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకున్న నాయకులు వేమిరెడ్డి గారిని పుష్పగుచ్ఛం, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులందరితో మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డిగారి వెంట తామందరం నడుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పి.శ్రీను, బసవయ్య నాయుడు, రమేష్, వంశీ, వెంకయ్య, గియాజుద్దీన్, కరిముల్లా, పలువురు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






