వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం వద్దకు చేరుకున్న మాజీ సీఎం జగన్

జనసాక్షి : వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణం చేరువకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్. జగన్‌మోహన్‌రెడ్డి.
జగన్‌తో సహా, మెడలో నల్ల కండువాలు ధరించిన వైయస్సార్‌పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
సేవ్ డెమొక్రసీ అని నినాదాలు చేస్తూ, అసెంబ్లీ వైపు వెళ్తున్న వైయస్ జగన్, వైయస్సార్‌పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు.
వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని చింపేసిన పోలీసులు.పోలీసుల తీరుపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం. ఆ అధికారం ఎవరిచ్చారంటూ.. గట్టిగా పోలీసులను నిలదీసిన వైయస్ జగన్.
అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
పోలీసుల ఝులుం ఎల్లకాలం సాగబోదన్న శ్రీ వైయస్ జగన్.
పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిక.
పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని, ఆగ్రహం.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీసిన శ్రీ వైయస్ జగన్.
What's Your Reaction?






