రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలి

Nov 20, 2024 - 14:42
 0  9

 రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలని నెల్లూరు జిల్లా ఆత్మ పిడి డాక్టర్ శివ నారాయణ, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ శాఖ  అధికారి ఈ శైలజ కుమారి తెలిపారు. బుధవారం   వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామం లోని రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో   జరిగింది.  ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆత్మ పిడి డాక్టర్ శివ నారాయణ, నెల్లూరు జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ఈ శైలజా కుమారి పాల్గొన్నారు .డాక్టర్ జి శివ నారాయణ  మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ వారి సలహాలు పాటించకుండా విచ్చలవిడిగా ఎరువులు, పురుగుమందులు వాడటం వలన వ్యవసాయంలో సాగు ఖర్చు పెరిగి మిత్ర పురుగులు నశించి పంటలు దిగుబడును తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.  రైతులు దీని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ వారి సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు.  అలాగే సాంకేతిక పద్ధతులు పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రైతులందరూ క్రమీపి తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడకం పెంచాలని రైతులకు సూచనలు ఇచ్చారు.  అలాగే జిల్లా వనరుల కేంద్రం నుండి వచ్చిన వ్యవసాయ అధికారిని ఈ.శైలజా కుమారి మాట్లాడుతూ మినుము పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి వివరించారు.  అలాగే ఈ వర్షాలకి తెగుళ్లు,  పురుగులు ఎక్కువ ఆశిస్తాయి ముఖ్యంగా లద్దె పురుగు నివారణకు ఎకరాకు పది లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకొని తూర్పు ఉదృతిని నివారించాలి.  అలాగే గ్రుడ్లు సముదాయలను ఏరి వెయ్యాలని   ఎకరాకు ఎన్ పి వి 200 ml ఈ ద్రావణం సాయంకాలం సమయంలో పిచ్చికారి చేసుకోవాలని సూచించారు.  పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్రలు వెదజల్లుకోవాలని తెలిపారు. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 ML లేదా క్లోరి పైరిఫాస్ 500 ML ఐదు కిలోల తౌడు, అరకిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో పొలం మొత్తం వెదజల్లాలి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పి శ్రీకాంత్ రెడ్డి మరియు ఉద్యానవన సహాయకులు ఖాదర్ భాషా మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow