టీడీపీ అఖండ విజయం లో ముస్లిం మైనార్టీలది కీలక పాత్ర

Oct 18, 2024 - 09:16
Oct 18, 2024 - 09:18
 0  447
టీడీపీ అఖండ విజయం లో  ముస్లిం మైనార్టీలది  కీలక పాత్ర

టీడీపీ అఖండ విజయంలో ముస్లిం మైనారిటీలది కీలక పాత్ర

- నారాయణ గారి చొరవతోనే షాదీమంజిల్ నిర్మాణం. 

- టీడీపీ మైనారిటీలకు అండగా ఉంటుంది. 

- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 

 నెల్లూరు జనసాక్షి  : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది శాసనసభ రెండు ఎంపి స్థానాలు టీడీపీ గెలవడంతో ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులు కీలక పాత్ర పోషించారని   ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంత్రి నారాయణతో కలిసి నెల్లూరు నగరం 43 వ డివిజన్ పరిధిలోని కోటమిట్ట షాదీమంజిల్ లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ముస్లిం సోదరులు శుభకార్యాల చేసుకోవడం గత తెలుగుదేశం పాలనలో మంత్రి నారాయణ  చొరవతో ఈ షాదీ మంజిల్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ షాదీమంజిల్ లో శుభకార్యాలు చేసుకునే ముస్లిం సోదరులకు ఆర్ధిక భారం తగ్గించాలన్న మంత్రి నారాయణ సూచన మేరకు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించారన్నారు. ఈ షాదీమంజిల్ లో శుభకార్యాలు చేసుకునే ముస్లిం సోదరులకు ఆర్ధిక భారం కాకూడని ఛైర్లు, టేబుల్స్, వంట పాత్రలు లాంటి కొన్ని మౌలిక సదుపాయాల కోసం మంత్రి నారాయణ  చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యంలో నెల్లూరు ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని భాగస్వాముల్ని మంత్రి నారాయణ

కి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమీషనర్ సూర్యతేజ, రాష్ట వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టిడిపి రాష్ట కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, స్థానిక టిడిపి నాయకులు జాఫర్ షరీఫ్(జాకీర్), జాఫర్ మొహిద్దీన్, ఖలీల్, కాలేషా తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow