మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీరు చేరిన ఇందిరమ్మ కాలనీని సందర్శించిన ఎంపీ ఆదాల

-24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఎంపీ ఆదాల విస్తృత పర్యటన
-తీవ్రతుఫాను నేపథ్యంలోనూ కాలనీని సందర్శించిన ఎంపీ అదాల
-అధైర్య పడకండి అండగా ఉంటాను స్థానికులకు ఎంపీ ఆదాల భరోసా*
-వర్షపునీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించి పరిశీలించిన ఎంపీ ఆదాల
-వెంటనే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించిన ఎంపీ ఆదాల
-స్థానికులు సహకరిస్తే వెంటనే ఆక్రమణలు తొలగింపు -- ఎంపీ ఆదాలప్ర
-జలకు ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామన్న ఎంపీ ఆదాల
నెల్లూరు జనసాక్షి : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లోని ఇందిరమ్మ కాలనీలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఇందిరమ్మ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా స్థానిక కాలనీ వాసులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లు చేరిన విధానాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వయంగా చూడడం జరిగింది. అయితే డ్రైనేజీ కాలువపై ఆక్రమ కట్టడాలు నిర్మించడం వల్లే నేడు ఈ పరిస్థితి నెలకొందని వెంటనే ఆక్రమణలు తొలగించి నిలువ చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని స్థానిక ప్రజలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు పూర్తి సహకారం అందిస్తే ఆక్రమణలు తొలగించి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదురుకాకుండా చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇందిరమ్మ కాలనీ ప్రజలకు తెలియజేశారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో, గ్రామాలలోని వైయస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, అవసరమైన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ కాలనీలో నెలకొని ఉన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక డివిజన్ నాయకులు జెసిబి
ల ద్వారా నీరు వెళ్లేందుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీపీ బీవి రమణారెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి,
డివిజన్ ఇంచార్జీలు ఉడత మురళీ యాదవ్, ఇసనాక సురేంద్రరెడ్డి, నీళ్ల సునీల్ యాదవ్, చిట్టమూరు విష్ణు, వెందోడు రామచంద్రారెడ్డి, రామలింగారెడ్డి జగదీష్ రెడ్డి, క్లస్టర్ 2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, ఏఎంసి చైర్మన్ పేర్నాటి కోటేశ్వర రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు డాక్టర్ షేక్ సత్తార్, తాళ్లూరు అవినాష్, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, సిహెచ్ హరిబాబు యాదవ్, చెన్నారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శివ సునీల్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, మండల జెసిఎస్ అధ్యక్షులు చేరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, ఏఎంసి డైరెక్టర్ తాటిపర్తి వెంకటేశ్వర్లు, క్లస్టర్ 1 అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, జిల్లా పార్టీ ఈసీ మెంబర్ సిహెచ్ సూరిబాబు, నాయకులు వేలూరు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి, తురక సూరిబాబు, కొండేటి శివారెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి, జి వెంకటేశ్వర్లు నాయుడు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, 24వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
What's Your Reaction?






