బుర్రా మధుసూదన్ యాదవ్ కు మద్దతుగా ఈనెల 19న నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం

బుర్రా మధుసూదన్ యాదవ్ కు మద్దతుగా నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం.
- వైసీపీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ
జనసాక్షి : కందుకూరు నియోజకవర్గ స్థాయి నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం ఈనెల 19వ తేదీన సాయంత్రం కందుకూరు పామూరు రోడ్డులోని త్యాగరాజ మందిరము వద్ద జరుగుతుంది. ఈ సందర్భంగా ముద్రించిన కరపత్రాలు వైయస్సార్ సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరణ చేశారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాజంలో సేవకులుగా వున్న నాయీ బ్రాహ్మణులను పాలకులుగా చేసి అన్ని రంగాలలో ప్రోత్సహించారు అని అన్నారు. బి.సి లను తోకలు కత్తిరిస్తాని అవమానపరిచే చంద్రబాబు కు జగనన్నకు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వున్నది అని అన్నారు. ఈకార్యక్రమంలో వైయస్సార్ సిపి బి.సి సెల్ ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది జె.వసంత లక్ష్మి, నాయీ బ్రాహ్మణ నేతలు కొచ్చెర్ల చిరంజీవి, ద్రోణాదుల మాల్యాద్రి, చింతలపూడి సురేష్, కొచ్చెర్ల నాగరాజు, చింతలపూడి సుధాకర్, కందుకూరి రమణయ్య, కరేటి సుబ్బారావు, కొచ్చెర్ల శ్రీనివాసరావు, ద్రోణాదుల మణిబాబు, గోనుగుంట శ్రీను, పొట్లూరి హరిబాబు,కొనిజేటి శ్రీనివాసులు
What's Your Reaction?






