బుచ్చి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కండి - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Feb 7, 2025 - 20:27
 0  8

బుచ్చి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కండి

బుచ్చిరెడ్డి పాళెం అభివృద్ధి కాంక్షిస్తూ తనతో కలిసి నడిచిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. బుచ్చి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ సముదాయ నిర్మాణ పనులకు ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా స్తంభించిన బుచ్చి అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు స్థానిక కౌన్సిలర్లు నాయకులు తనతో సహకరించాలని కోరారు. ఈ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా 60 కి పైగా కుటుంబాలకు ఉపాధి దొరకడమే కాకుండా బుచ్చి నగర పంచాయతికి ఆదాయ వనరుగా మారుతుందన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలు CSR నిధులు వెచ్చించి బుచ్చి అభివృద్ధిలో భాగస్వాములైన తేజూ డెవలపర్స్ యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. వ్యాపారులకు అసౌకర్యం కల్గకుండా ఈ మార్కెట్ సముదాయాన్ని వీలైనంత త్వరగా నిర్మించ వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతి కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివ కుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, కౌన్సిలర్లు ప్రత్యూష, పుట్టా లక్ష్మి కాంతమ్మ , తాళ్ళ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow