ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి
-మంత్రి డి ఎస్ బి వి స్వామి అధికారులకు సూచన
-ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పాలన
కొండపి జనసాక్షి : ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. డాక్టర్ స్వామి మంత్రి పదవి చేపట్టిన తరువాత తొలిసారిగా కొండపిలోని పొదిలి రోడ్లో ఉన్న స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ పంచాయతీరాజ్ ఇతర శాఖల అధికారులతో ఆయన శాఖల పురోగతి గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో సుబ్బారెడ్డి కనిగిరి ఆర్డీవో , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?






