పూజ్య బాపూజీ శాంతి మార్గం నేటి యువతకు ఆదర్శం కావాలి

Jan 30, 2025 - 14:35
 0  24
పూజ్య బాపూజీ శాంతి మార్గం  నేటి యువతకు ఆదర్శం కావాలి

జనసాక్షి  : సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన పూజ్య బాపూజీ శాంతి మార్గం నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . మహాత్మా గాంధీ 77 వ వర్ధంతి సందర్భంగా పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోని బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గాంధీ ఆశ్రమంలో విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ అడుగడుగునా పూజ్య బాపూజీ జ్ఞాపకాలతో ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పల్లిపాడు గాంధీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సర్వజన హితమే నా మతమని చాటి చెప్పిన మహాత్మా గాంధీ మహోన్నత మానవతావాది అని కొనియాడారు. భారతదేశానికి జాతిపిత అయ్యారు. ఎందరో స్వాతంత్య్ర పోరాట యోధులకు స్వరాజ్య స్ఫూర్తిని రగిల్ఛిన పల్లిపాడు గాంధీ ఆశ్రమాన్ని మరో సబర్మతి ఆశ్రమంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని తన ఎంపి నిధులతో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. 

మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన గాంధీ ఆశ్రమ ఘన చరిత్ర భావి తరాలకు తెలిపేలా పల్లిపాడును మరో సబర్మతిగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా తాను ఎంపి గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారాని తెలిపారు. కుల, మత అసమానతలు లేని సమాజం కోసం కలలు కన్న మహాత్మ గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ కుమార్ రెడ్డి,గాంధీ ఆశ్రమ కన్వీనర్ కల్పనమ్మ, గునపాటి ప్రసాద్ రెడ్డి, రెడ్ క్రాస్ డైరెక్టర్ యాలమూరి రంగయ్య నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర నాయుడు, టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి టిడిపి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow