కందుకూరు టి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పక్షుల దినోత్సవం

కందుకూరు టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రపంచ పక్షుల దినోత్సవం, కళాశాల యొక్క జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ పిచ్చుకలు మానవుల యొక్క స్నేహితులని, పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో దోహద పడుతున్నాయని తెలియజేశారు. ఈనాడు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వలన పిచ్చుకలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని తెలియజేశారు. కళాశాలలో పిచ్చుకల పరిరక్షణకు గుళ్ళు ఏర్పాటు చేసి, గింజలు, నీళ్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
జంతు శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ ఐ. అనూష మాట్లాడుతూ పిచ్చుకలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. పిచ్చుకల దినోత్సవం ఏ సందర్భంగా ప్రారంభించారో, ఆ స్ఫూర్తిని కొనసాగించి, గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చుకలను కాపాడుకోవాల్సిన ప్రాధాన్యతను విద్యార్థినీ విద్యార్థులు అందరూ వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర, అధ్యాపకులు డాక్టర్ ఎన్వి శ్రీహరి,డాక్టర్ కే సుజాత, డాక్టర్ పి రాజగోపాల్, డాక్టర్ ఎన్ తిరుపతి స్వామి, శ్రీమతి జే జ్యోతి, శ్రీ జి బ్రహ్మయ్య తదితరులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?






