దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్ బైకులను పంపిణీ చేసిన మంత్రి డోలా

May 23, 2026 - 13:04
May 23, 2026 - 13:06
 0  76
దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్  బైకులను పంపిణీ చేసిన మంత్రి  డోలా

మార్కాపురం జిల్లా : జనసాక్షి 

మార్కాపురంలో దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ మోటార్ బైక్ లను  మంత్రి డిఎస్ బీవీ స్వామి  శనివారం పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు మేలు చేసే విషయంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటార ని తెలిపారు. రూ.17.5 కోట్లతో రాష్ట్రంలో 1750 మంది దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ బైక్ లు పంపిణీ చేసినట్లు చెప్పారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో దివ్యాంగులకు ప్రతి నెలా రూ.6 వేలు, రూ. 15 వేలు పింఛన్ ఇస్తున్నామని తెలియజేశారు.దివ్యాంగ శక్తి పధకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.చరిత్రలో ఎన్నడు లేని విధంగా రూ. 4.38 కోట్లతో దివ్యాంగ హాస్టళ్లకు మరమ్మతులు చేస్తున్నాం, దివ్యాంగుల కోసం బాపట్లలో ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.దివ్యాంగుల కోసం విశాఖలో రూ. 200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నాం.

ప్రతి జిల్లాలో దివ్యాంగ భవన్ లు నిర్మిస్తాం....దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం.. త్వరలో నియామక పత్రాలు అందజేస్తాం.దివ్యాంగుల కోసం కలెక్టరేట్లలో ప్రత్యేకంగా లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే ఇంద్రధనస్సు హామీలన్నీ అమలు చేస్తామ ని మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow