జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రీడాకారులు ఎంపిక
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఈ నెల 15,16 తేదీలలో కాకినాడలో ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 8వ క్యాడేట్ 39వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలలో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని తైక్వాండో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి మాస్టర్ ఎస్.కే.అబ్దుల్ సలాం తెలియజేశారు.బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెలలో పంజాబ్ లోని జలంధర్ లో జరగబోవు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు..పతకాలు సాధించిన క్రీడాకారులను, శిక్షకులు సలావుద్దీన్, ముఖేష్ కుమార్, అఖిల్, సుబ్రహ్మణ్యం, ప్రశాంత్ బాబులను జిల్లా అధ్యక్షులు ఉన్నo.వీరస్వామి,కార్యదర్శి ఎస్. కే అబ్దుల్ సలాం తదితరులు అభినందనలు తెలిపారు.
What's Your Reaction?