జనంలోకి జగన్

జనం లోకి సీఎం జగన్
జనసాక్షి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ సంసిద్ధంగా ఉంది. మేనిఫెస్టోపై త్వరలో కీలక ప్రకటన వెలువడాల్సి ఉండగా.. ఈలోపే భారీ ఎన్నికల ప్రచారంపై ప్రకటన చేసింది. సీఎం జగన్ బస్సుయాత్ర ప్రకటనతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నెలకొంది. హుషారుగా యాత్రలో పాల్గొనేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధం అవుతున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్రతో జనాల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికలకు సమయం ఎక్కువ ఉండడంతో వీలైనన్ని ఎక్కువ రోజులు ఆయన ప్రజల మధ్యే గడపాలని చూస్తున్నారు. చేసిన అభివృద్ధిని, ప్రజలకు చేర్చిన సంక్షేమంతో పాటు ఈ పాలనలో అందించిన సామాజిక న్యాయాన్ని ఆయన ప్రజలకు వివరించనున్నారు. అలాగే.. మరింత మెరుగైన పాలన కోసం జనాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.
-యాత్ర ఎలా ఉండనుందంటే.
తొలుత వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారని.. అక్కడ తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్ ఆశీర్వాదం తీసుకుని యాత్రకు బయల్దేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే బస్సు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమై.. ఎక్కడ ముగుస్తుందో అనే దానిపై ఇవాళ స్పష్టత రానుంది. ఈ మేరకు రోడ్ మ్యాప్‌తో సహా ఎన్నికల ప్రచార షెడ్యూల్ పూర్తి వివరాలపై వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన చేయనుంది.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ 27 నుండి బస్సుయాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాల మినహాయింపు ఉంటుందని సమాచారం. ఇక మిగిలిన 21 జిల్లాల్లోనూ బస్సుయాత్ర కొనసాగనుంది. పార్లమెంటు నియోజకవర్గంను ఒక యూనిట్‌గా విభజించి(ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసేలా).. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగిస్తారని తెలుస్తోంది. బస్సు యాత్ర ముగిసిన అనంతరం.. మలి విడత ఎన్నికల ప్రచారం ఉంటుందని పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్నిలక ప్రచార సభలు, ర్యాలీలు ఉంటాయని.. అందులో సీఎం జగన్ పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ చెబుతోంది.
What's Your Reaction?






